ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది ఇంటిపై ఎఫ్‌బీఐ దాడులు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది రూడీ గియులియాని ఇంటిపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) దాడులు చేపట్టింది.

న్యూయార్క్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది రూడీ గియులియాని ఇంటిపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) దాడులు చేపట్టింది. న్యూయార్క్ నగర మాజీ మేయర్ అప్పర్ ఈస్ట్ సైడ్ అపార్ట్‌మెంట్‌తో పాటు అతని పార్క్ అవెన్యూ కార్యాలయంలో కూడా తనిఖీలు నిర్వహించారు. 76 ఏండ్ల వయసున్న రూడీ గియులియాని ఇళ్లు, కార్యాలయం నుంచి అనేక ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
రూడీ గియులియాని విదేశీ ఏజెంట్‌గా నమోదు చేయడంలో విఫలమయ్యారనే ఆరోపణను వారెంట్‌లో ఎఫ్‌బీఐ చేర్చింది. విదేశీ ఏజెంట్ల నమోదు చట్టం ప్రకారం ప్రజలు మరొక దేశం తరపున విదేశీ ఏజెంట్‌గా వ్యవహరిస్తుంటే విదేశాంగ శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది.
ఉక్రేనియన్ ఇంధన సంస్థ బోర్డులో పనిచేసిన మిస్టర్ జో బైడెన్, అతడి కుమారుడు హంటర్ బైడెన్‌పై దర్యాప్తు చేయాలని ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో రూడీ గియులియాని ప్రధాన పాత్ర పోషించారు. ఉక్రెయిన్ మాజీ అమెరికా రాయబారిని బహిష్కరించడంలో కూడా కీలకపాత్ర పోషించారని డొనాల్డ్ ట్రంప్ అభిశంసన విచారణ సందర్భంగా సాక్షులు తెలిపారు. గియులియాని ఉక్రెయిన్‌తో వ్యవహరించిన దర్యాప్తులో భాగంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తున్నది. చట్టాన్ని ఉల్లంఘించడాన్ని గియులియాన్ ఖండించారని ఆయన న్యాయవాది తెలిపారు.
2020 అధ్యక్ష ఎన్నికలకు ముందు ఉక్రెయిన్‌లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్, అతడి కుమారుడు హంటర్ బైడెన్ గురించి దోషపూరిత సమాచారాన్ని కనుగొనే ప్రయత్నాన్ని గియులియాని చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యే అవకాశాలను పెంచుకోవడానికి ఉక్రెయిన్ నుంచి సహాయం కోరిన ఆరోపణలపై 2019 లో డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు గురయ్యారు.
ఇవి కూడా చదవండి…
కొవిడ్ చావులపై చర్చ పనికిరానిది.. చనిపోయినవారు తిరిగిరారు : సీఎం మనోహర్ లాల్ ఖట్టర్
అంతరిక్ష కేంద్రం మొదటి మాడ్యూల్‌ను ప్రయోగించిన చైనా
100 రోజుల పదవీకాలం పూర్తి చేసుకున్న జో బైడెన్
బంగ్లాదేశ్‌లో సముద్ర తుఫాను.. లక్షకు పైగా మరణం.. చరిత్రలో ఈరోజు
ఎన్నికల అధికారులపై మరణించిన అభ్యర్థి భార్య ఫిర్యాదు
‘మహారాష్ట్ర లాక్డౌన్ మరో 15 రోజులు పొడగింపు’: మంత్రి రాజేష్ తోపే
కేరళలో అత్యధికంగా 32 వేల కేసులు నమోదు
5 రోజుల్లోనే నిర్మించిన తొలి 3డీ ప్రింటింగ్ ఇల్లు
ఢిల్లీలో అమల్లోకి వచ్చిన ఎన్సీటీ బిల్లు
ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ వచ్చినా కరోనా రావొచ్చు : డాక్టర్ రణదీప్ గులేరియా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

