మరికొన్ని రోజుల్లో తన పెండ్లి జరుగుతుందని, భర్తతో హాయిగా కాపురం చేస్తానని కలలుగన్నది. కరోనా ప్రభావంతో తీరా పెండ్లి కాస్తా రద్దు కావడంతో పెండ్లి గౌను ధరించి వచ్చి టీకా తీసుకుందా యువతి. పెండ్లి గౌనుపై వచ్చి టీకా తీసుకుంటున్న అమ్మడి ఫొటోలను యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సిస్టం సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అమెరికాలోని బాల్టిమోర్‌కు చెందిన మహిళ సారా స్టడ్లీ పెండ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నది. వీరి పెండ్లికి కాలిఫోర్నియాలోని శాన్‌డియాగోలోని బాల్బోవా పార్కును సిద్ధం చేసుకున్నారు. మరికొన్నిరోజుల్లో పెండ్లి జరుగుతుందనగా.. కరోనా సెకండ్ వేవ్ ప్రబలడం, మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు తలెత్తడంతో సారా కలల పెండ్లి కాస్తా రద్దయిపోయింది. సాదాసీదాగా వివాహ వేడుకను జరుపుకోవాలనుకున్న సారా స్టడ్లీ.. అది కూడా రద్దవడంతో కాస్తా ఆందోళనకు గురైంది.
బతికుంటే బలుసాకు తినొచ్చనుకున్న సారా.. కరోనా వైరస్ నుంచి తనను తాను కాపాడుకునేందుకు తిన్నగా టీకా క్యాంపుకు వెళ్లాలని నిశ్చయించుకున్నది. పెండ్లి కోసం సిద్ధం చేసుకున్న తెల్లటి గౌనును బయటకు తీసి ధరించి ముస్తాబై.. టీకా సెంటర్‌కు వెళ్లింది. పెండ్లి గౌనులో ముస్తాబై రావడంతో అక్కడున్న సిబ్బంది తొలుత ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తేరుకుని.. ఆమె పెండ్లి రద్దయిందని తెలుసుకుని బాధపడి.. టీకా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
పెండ్లి గౌనులో వచ్చిన సారా స్టడ్లీని యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సిస్టం క్లినిక్ సిబ్బంది ఫొటోలు తీసి నాలుగు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో సారా స్టడ్లీ ఫొటోలు వైరల్‌గా మారాయి.
సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్న ఈ పోస్ట్ చూసిన తర్వాత సోషల్ మీడియా యూజర్లు బాగా ఆకట్టుకున్నారు. నెటిజెన్లు వివిధ కామెంట్లు పోస్టు చేస్తూ సారాకు తమ మద్దతు తెలుపుతున్నారు.
57 దేశాల్లోని మహిళలకు వారి శరీరాలపై హక్కులు లేవు..!
త్వరలో కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశం : ఆదిత్యా ఠాక్రే
ప్రిన్సిపాల్ చెంపదెబ్బ.. బాలిక ఆత్మహత్య
నిత్యం 3 లక్షల రెమ్‌డెసివిర్ డోసుల ఉత్పత్తి : మన్సుఖ్ మాండవీయ
రేపు అంగారకుడిపై ఎగరనున్న నాసా హెలికాప్టర్
పేదల బాగు కోసం భూదానం.. చరిత్రలో ఈరోజు
ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మంత్రిని మార్చిన ఇమ్రాన్‌ఖాన్
రాత్రి విధుల పేరిట మహిళలకు ఉద్యోగాలివ్వరా?: కేరళ హైకోర్టు
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..