హైదరాబాద్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొనసాగుతున్నదని ప్రజా ప్రభుత్వమా? లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్‌కు వత్తాసు పలుకడమేనా అని నిలదీశారు. టెసోకు స్కూల్ యూనిఫామ్‌లు కుట్టే ఆర్డర్లు రద్దు చేసి ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి రేవంత్ సరార్ చేనేత సంఘాల కార్మికుల పొట్టకొడుతున్నదని గురువారం ఎక్స్ వేదికగా కేటీఆర్ మండిపడ్డారు. రూ.105 కోట్ల విలువైన సూల్ యూనిఫామ్స్ కుట్టే ఆర్డర్‌ను వెనకి తీసుకోవడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సంక్షేమ శాఖ నుంచి టెసోకు దకాల్సిన దుస్తులు, దుప్పట్ల రూ.200 కోట్ల ఆర్డర్ ఇంకా ఇవ్వకపోవడం వెనుక కారణం ఏమిటని నిలదీశారు. కమీషన్లు దండుకోవాలనే యావలో కాంగ్రెస్ దండుపాళ్యం ముఠా ప్రైవేట్ వ్యక్తులకు ఆర్డర్లు ఇస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నేతన్నల ఉసురు పోసుకుంటున్న కరశ కాంగ్రెస్ సర్కార్‌కు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.
బహుజనుల ఆత్మగౌరవం కోసం, పీడిత పక్షాల కోసం జీవితాంతం పోరాడిన మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. బహుజన వీరుడు పాపన్నగౌడ్ వర్ధంతి సందర్భంగా గురువారం ఆయనకు ఎక్స్ వేదికగా నివాళులులర్పించారు.