చేగుంట, సెప్టెంబర్ 22: యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. సోమవారం మెదక్ జిల్లా చేగుంటకు యూరియా వస్తుందనే సమాచారం రావడంతో తెల్లవారుజామున నాలుగు గంటలకే ఎరువుల దుకాణం వద్దకు రైతులు చేరుకున్నారు. చేగుంటలో ఎరువుల దుకాణం వద్ద చెప్పులు, చెట్లకొమ్మలు క్యూలో ఉంచి నిరీక్షించారు. పోలీసుల పహారాలో యూరియా పంపిణీ చేశారు.
నిజాంపేట, సెప్టెంబర్ 22: యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని చల్మెడ గ్రామానికి సరఫరా అయిన యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున క్యూలో నిల్చున్నారు. వ్యవసాయశాఖ, పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో రైతులకు యూరియా పంపిణీ చేశారు.