సిద్దిపేట, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యూరియా దొరకక అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. రోజురోజుకూ యూరియా కొరత ఏర్పడుతున్నది. దీంతో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. సోమవారం యూరియా కోసం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. రోడ్డెక్కి నిరసన తెలిపారు.
ఆయా చోట్ల అధికార పార్టీ నేతలు, అధికారులను నిలదీశారు. ఇదేమి రాజ్యమంటూ మండిపడ్డారు. నెలరోజులైనా సరిపడా యూరియా తెప్పించడంలో సర్కారు విఫలమైందంటూ నిలదీశారు. నమ్మి ఓటేస్తే నట్టేట ముంచారని, బస్తా యూరియా కోసం ఇలా గంటల తరబడి క్యూ కట్టే రోజులు మళ్లీ వచ్చాయని రైతులు
ఆవేదన వ్యక్తం చేశారు.