సిద్దిపేట రూరల్, సెప్టెంబర్ 8: డంపింగ్ యార్డు నుంచి వచ్చే దుర్గంధంతో అనారోగ్యం పాలవుతున్నామని, భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయని వెంటనే డంపింగ్ యార్డును గ్రామం నుంచి తరలించాలని సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలంలోని బుస్సాపూర్ రైతులు డిమాండ్ చేశారు. సోమవారం గ్రామ శివారులో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు.
డంపింగ్ యార్డు ఎదుట చెత్త వాహనాలు లోపలికి రాకుండా అడ్డుగా కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డంపింగ్ యార్డు వల్ల గ్రామ చెరువులు కలుషితమ వుతున్నాయని, ఆనీటిని తాగి చేపలు చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పశువులు సైతం ఆకలుషిత నీరుతాగి రోగాల బారిన పడుతున్నాయని వాపోయారు. ఈ విష యం తెలుసుకున్న సిద్దిపేట ఆర్డీవో సదానందం, మున్సిపల్ కమిషనర్ అశ్రిత్కుమార్, రూరల్ తహసీల్దార్ స్వామి, సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్సై రాజేశ్ అకడికి చేరుకున్నారు. రెండు రోజుల్లోగా సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిషరిస్తామని హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు.