జహీరాబాద్, సెప్టెంబర్ 8: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును జహీరాబాద్ ప్రజాప్రతినిధులు, నాయకులు కలిశారు. సోమవారం హైదరాబాద్‌లోని కోకాపేట్‌లోని ఆయన నివాసంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, డీసీఎంఎస్ ఉమ్మడి జిల్లా చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ నాయకులతో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇటీవల లండన్ పర్యటనకు వెళ్లి వచ్చిన సందర్భంగా కలిసినట్లు వారు తెలిపారు. జహీరాబాద్ మండలంలోని శేఖాపూర్‌లో నిర్వహించనున్న హజ్రత్ షేక్ షాహబుద్దీన్ షాహిద్దర్గా ఉత్సవాలకు రావాలని ఆగ్రామ బీఆర్ఎస్ నాయకులు, దర్గా ఉత్సవ కమిటీ సభ్యులు హరీశ్‌రావుకు ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండల అధ్యక్షులు తట్టు నారాయణ, వెంకటేశం, సంజీవ్‌రెడ్డి, నర్సింహులు, నాయకులు షేక్‌ఫరీద్, చిన్నరెడ్డి, స్రవంతిరెడ్డి, మొహీజొద్దీన్ పాల్గొన్నారు.