సిద్దిపేట, సెప్టెంబర్ 8: సమస్యలను త్వరగా పరిష్కరించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్లో ప్రజావాణి ద్వారా జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో వివిధ సమస్యల పరిషారానికి 168 దరఖాస్తులు వచ్చాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిషరించడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజావాణి ద్వారా తమ సమస్యలు పరిషారమవుతాయని ప్రజలు ఎంతో విశ్వాసంతో దరఖాస్తులు అందజేస్తారన్నారు. ప్రతి దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించి సమస్యల పరిషారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, అబ్దుల్హమీద్, డీఆర్వో నాగరాజమ్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.