హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ ) : ఆర్థిక వనరుల సమీకరణ పేరిట హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల ప్రభుత్వ భూమి వేలం ప్రక్రియను ఆపాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. భవిష్యత్తు అవసరాల కోసం భూముల వేలాన్ని ఆపాలని కోరారు. ఆర్థిక వనరుల పేరిట ప్రభుత్వ భూములను అమ్మడం దారుణమని పేర్కొన్నారు.