న్యూఢిల్లీ: దేశంలో మరో సెమీకండక్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. బుధవారం కేంద్ర క్యాబినెట్(Union Cabinet) ఆ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని జేవర్లో సుమారు 3706 కోట్ల ఖర్చుతో ఆ సెమీకండక్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. హెచ్‌సీఎల్-ఫాక్స్‌కాన్ కంపెనీ.. సెమీకండక్టర్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించనున్నది.
మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఆటోమొబైల్స్, ఇతర డివైస్‌లకు కావాల్సిన డిస్ప్లే డ్రైవర్ చిప్స్‌ను అక్కడ తయారు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. నెలకు సుమారు 20 వేల వాఫర్లను ప్రాసెస్ చేయనున్నారు. ఈ కంపెనీ ద్వారా సుమారు రెండు వేల ఉద్యోగాలు కల్పించనున్నారు.
దేశంలో ఇప్పటికే అయిదు సెమీకండక్టర్ యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. ప్రస్తుతం ఆరో కంపెనీకి శ్రీకారం చుట్టున్నారు. హెచ్‌సీఎల్, ఫాక్స్‌కాన్ కంపెనీలు సంయుక్తంగా సెమీకండక్టర్ల ఉత్పత్తి చేయనున్నాయి. హార్డ్‌వేర్ ఉత్పత్తి, అభివృద్ధిలో హెచ్‌సీఎల్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇక ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో ఫాక్స్‌కాన్ కూడా ప్రపంచ మేటి సంస్థే. యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ సమీపంలో ఉన్న జీవార్ విమానాశ్రయం వద్ద కొత్త కంపెనీ ఏర్పాటు చేయనున్నారు.
#Cabinet chaired by Prime Minister @narendramodi today approved the establishment of one more semiconductor unit under India Semiconductor Mission.
➡️Already five semiconductor units are in advanced stages of construction. With this sixth unit, Bharat moves forward in its… pic.twitter.com/pFCsOoQTaP
— PIB India (@PIB_India) May 14, 2025