మహబూబ్నగర్, జనవరి 12 : కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరిట 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని నమ్మించి ప్రభుత్వంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినా ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో అడ్డుకుంటున్నారని పా లమూరు నిరుద్యోగ అభ్యర్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పాలమూరు జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ నుంచి జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడు తూ 2022లో గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేష న్లు 50 వేల పోస్టులను భర్తీ చేసినవి వాటి నే ఒక మంత్రి 70వేలు అని, మరో మంత్రి 80 వేలు అని, నిన్న ఓ మంత్రి లక్ష పోస్టులు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని, అసలు మీరు అధికారంలోకి వచ్చింది 2023లో అయితే 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ మీరు ఇచ్చినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. మీ ప్రజాపాలనలో ఒక్క పోస్టు కూడా ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు యూనివర్సిటీలో ఉన్న టీచింగ్, నాన్ టీ చింగ్ పోస్టులను తక్షణమే భర్తీ చే యడంతోపాటు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.5 వేల భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.