అసోంలో ఎన్కౌంటర్.. ఉల్ఫా కీలక నేత హతం
అసోంలో ఎన్కౌంటర్.. ఉల్ఫా కీలక నేత హతం | పశ్చిమ అసోంలోని బొంగైగావ్ జిల్లాలో గురువారం తెల్లవారు జామున జరిగిన ఎన్కౌంటర్లో ఉల్ఫా ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నేత హతమయ్యాడు.

దిస్పూర్ : పశ్చిమ అసోంలోని బొంగైగావ్ జిల్లాలో గురువారం తెల్లవారు జామున జరిగిన ఎన్కౌంటర్లో ఉల్ఫా ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నేత హతమయ్యాడు. మృతుడిని ఉల్ఫా ఉగ్రవాద సంస్థకు చెందిన వెస్ట్రన్ కమాండర్ ద్విపెన్ సౌద్‌గా అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా మరో వ్యక్తిని పోలీసు బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఉన్నత వర్గాలకు చెందిన కొందరిని అపహరించేందుకు ప్రణాళికలు వేస్తున్నారన్న సమాచారాన్ని పోలీసులు అందుకొని.. కుట్రను భగ్నం చేశారు. ఈ క్రమంలో మణిక్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బేసిమారి వద్ద కాల్పులు జరగ్గా.. పోలీసు కాల్పుల్లో ద్విపెన్ సౌద్ మృతి చెందాడు.
పాండుమ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్కౌంటర్ స్థలం నుంచి తుపాకీతో పాటు గ్రెనేడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీనియర్, మోస్ట్ వాటెండ్ అయిన రాజ్ఖోమా గతేడాది పోలీసులకు లొంగిపోయిన అనంతరం.. దిపెన్ సౌద్ ఇటీవల వెస్ట్రన్ కమాండర్‌గా నియామకమయ్యాడు. ఇటీవల ఉల్ఫా ఉగ్రవాదులు ఓఎన్జీకి చెందిన ముగ్గురు కార్మికులను అపహరించిన కొద్ది రోజుల తర్వాత ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. నాగాలాండ్‌లో ఇద్దరు కార్మికులను గుర్తించినా.. మరొకరి ఆచూకీ దొరకలేదు. అతను ఉల్ఫా-1 ఉగ్రవాదుల చెరలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి ఈటల ఫైర్
కూకట్‌పల్లిలో కాల్పుల కలకలం
తెలంగాణలో కొత్తగా 7,994 కరోనా కేసులు
కరోనా ఎఫెక్ట్.. చార్ధామ్ యాత్ర రద్దు
కొవిడ్ వ్యాక్సిన్లపై పన్ను మినహాయింపు?
కరోనా నుంచి కోలుకున్న మాజీ ప్రధాని మన్మోహన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

