Nirmal | నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన బైక్ అదుపుతప్పి ఈదిగామ వద్ద ఉన్న గోల్డెన్ ఫంక్షన్ హాలు ముందు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతులను మంజులాపూర్‌కు చెందిన సృజన్ (33), నటరాజ్ నగర్‌కు చెందిన ప్రపూల్ (34)గా గుర్తించారు. నిర్మల్ వైపుగా బైక్‌పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.