భైంసా, జూలై 10 : బాల్కనీ నుంచి కిందపడి రెండేండ్ల చిన్నారి చనిపోయిన ఘటన నిర్మల్ జిల్లా భైంసాలో శుక్రవారం జరిగింది. రాజస్థాన్‌కు చెందిన మాధవ్ సింగ్, ప్రియాంక పట్టణంలోని రాహుల్‌నగర్‌లో ఉంటున్నారు.
వీరి కుమార్తె కీర్తి (2) బాల్కనీలో ఆడుకుంటూ కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు భైం సాలోని దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.