రోషన్ కనకాల, గహజి ప్రధాన పాత్రల్లో ఓ సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్నది. సత్య, సుదర్శన్, రవితేజ సన్నివమాల కీలకపాత్రధారులు. విజయ్ కె.కామిశెట్టి దర్శకుడు. బాలాజీ గుట్ట, కౌశిక్‌రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో నిఖిల్ క్లాప్ ఇవ్వగా, సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్‌కుమార్ కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు ఐవి ఆనంద్ గౌరవ దర్శకత్వం వహించి, స్క్రిప్ట్‌ని చిత్రబృందానికి అందజేశారు. అతిథులంతా సినిమా బాగా రావాలని, మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఫాంటసీ, రొమాన్స్, కామెడీ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్ అంశాల మేళవింపుగా ఈ సినిమా ఉంటుందని, ఊహలు, భావోద్వేగాలతో కూడిన అద్భుతమైన ఓ కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులు చూస్తారని మేకర్స్ తెలిపారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలు కానున్న ఈ చిత్రానికి ప్రీప్రొడక్షన్ పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి కథ: వీఐ ఆనంద్, కెమెరా: అన్వేష్ వరాల, సంగీతం: శేఖర్‌చంద్ర.