Heart Attack | జైలుకు వెళ్తున్న.. ఎప్పుడొస్తనో తెల్వదంటూ మస్కట్ నుంచి భార్యకు చివరి కాల్.. అంతలోనే గుండెపోటుతో మృతి
Tragedy | గల్ఫ్ దేశానికి వెళ్లిన ఓ వలసజీవి జీవితం అనుకోనిరీతిలో విషాదాంతమైంది. ‘నేను జైలుకు పోతున్నా.. ఎప్పుడొస్తనో తెల్వదు జాగ్ర త్త’ అంటూ చివరిసారిగా మాట్లాడిన ఇం టి పెద్ద, ఒమన్ రాజధాని మసట్లో గుండెపోటుతో మృత్యువాత పడటం కలచివేసింది.
Heart Attack | కోనరావుపేట, జూలై 10: గల్ఫ్ దేశానికి వెళ్లిన ఓ వలసజీవి జీవితం అనుకోనిరీతిలో విషాదాంతమైంది. ‘నేను జైలుకు పోతున్నా.. ఎప్పుడొస్తనో తెల్వదు జాగ్ర త్త’ అంటూ చివరిసారిగా మాట్లాడిన ఇం టి పెద్ద, ఒమన్ రాజధాని మసట్లో గుండెపోటుతో మృత్యువాత పడటం కలచివేసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఆసరి వెంకటేశ్వర్లు (40)కు భార్య పుష్పలత, ఇద్దరు కొడుకులు మనోజ్, అజయ్ ఉన్నారు. ఆయన మూడేండ్ల క్రితం మసట్ వెళ్లాడు. వీసా గడువు ముగిసినా అకడే పనిచేస్తూ జీవ నం సాగిస్తున్నాడు. దీంతో జూన్ 16న అకడి పోలీసులు వెంక టేశ్వర్లును జైలుకు తరలించారు.
అదేరోజు వెంకటేశ్వర్లు భార్యకు ఫోన్‌చేసి తాను జైలుకు వెళ్తున్నానని, ఎప్పుడొస్తనో తెల్వదని క న్నీరుపెట్టుకున్నాడు. జూన్ 25న గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ అదే రోజు కన్నుమూశాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తమది పేద కుటుంబమని, మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని వేడుకుంటున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సర్పంచ్ మిర్యాలకర్ బాలాజీ, గ్రామస్తులు కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

