మేడ్చల్ : మేడ్చల్( Medchal ) పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. వేసవి సెలవులు వచ్చిన తొలిరోజే ఇద్దరి విద్యార్థులు ఈతకు ( Swimming ) వెళ్లి మృత్యువాత పడ్డారు .డబిల్పూర్కు చెందిన ఆరుగురు విద్యార్థులు ఆదివారం మధ్యాహ్నం సరదాగా ఈత కొట్టేందుకు గ్రామ పరిధిలోని ఇస్కాన్ టెంపుల్ సమీపంలో ఉన్న గుంతలో ఉన్న నీటిలో ఈత కొట్టేందుకు దిగారు.
నలుగురిలో ఇద్దరు లోతులోకి వెళ్లి నీట మునిగి మృతి చెందారు. మృతి చెందిన వారిలో 9వ తరగతి చదువుతున్న ఉమన్(14), ఏడవ తరగతి చదువుతున్న ఇర్ఫాన్(12)గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించారు.