Donald Trump | న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో తాను గెలిస్తే అమెరికా పౌరులను చంపిన వలసదారులకు మరణశిక్ష విధిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొలరాడోలోని అరోరాలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికాను ప్రమాదకరమైన నేరస్థులు ఆక్రమించుకున్నారని ఆరోపించిన ట్రంప్.. తాను అధ్యక్షుడినయ్యాక వలసదారులే లక్ష్యంగా నేషనల్ ఆపరేషన్ ఆరోరాను మొదలు పెడతానని చెప్పారు. అమెరికా పౌరులను, అధికారులను చంపిన వలసదారులకు ఉరి శిక్ష తప్పదని హెచ్చరికలు జారీ చేశారు.