అమరావతి : పంటపొలాలకు నీరు పారించేందుకు వెళ్లిన ఓ రైతుపై ఏనుగుదాడి (Elephant attack) చేసి చంపిన విషాద ఘటన చిత్తూరు (Chittoor) జిల్లాలో చోటు చేసుకుంది . కామకుప్పం పీఎంకేతండాలో కన్నా నాయక్ అనే రైతు పంట పొలాన్ని నీరు పారించి తిరిగి వస్తుండగా ఏనుగు దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో రైతు(Farmer) అక్కడికక్కడే చనిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు, అటవి శాఖ అధికారులు(Forest Officials) ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. శవపంచనామా జరిపి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఏనుగుల బీభత్సవంపై ఏనుగులు దాడి చేస్తు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని రైతులు పేర్కొన్నారు. వన్యమృగ ప్రాణులు జనసంచార ప్రాంతాలకు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.