Amaragiri Village | కొల్లాపూర్, మార్చి 26 : రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజక వర్గంలోని పర్యాటక గ్రామమైన అమరగిరి గ్రామానికి వెళ్లే రోడ్డు చెత్తతో నిండి ఉండడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా వివిధ దేశాలు వివిధ రాష్ట్రాల్లో పర్యాటక ప్రదేశాలను పరిశీలించి రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రణాళికలు చేస్తున్నా మంత్రి జూపల్లి ఇలాకలోనే పర్యాటక గ్రామాల పరిస్థితి ఇంత దయనీయ స్థితిలో ఉండడం ఏమిటని పర్యాటకులు ఎద్దేవా చేస్తున్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యాటక రంగ అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే సొంత నియోజకవర్గంలోని అమరిగిరి పర్యాటక ముఖద్వారంలోనే ఇందుకు విరుద్ధంగా ఉందంటే.. అధికారులు బహుశా పర్యాటక శాఖ మంత్రిగా నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నాడనేది మర్చిపోయారేమో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో సైతం మున్సిపల్ పరిధిలో సేకరించిన చెత్తను పర్యాటక గ్రామమైన అమరగిరి రోడ్డుపై వేయడంతో గ్రామ ప్రజలతోపాటు పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దుర్గంధమైన వాసనతో స్వాగతం..
గ్రామస్తుల ఆందోళనతోపాటు నమస్తే తెలంగాణ వరుస కథనాలతో చెత్తను తొలగించారు. కానీ మళ్లీ పాత పద్ధతికి మున్సిపల్ సిబ్బంది శ్రీకారం చుట్టినట్లు ఉంది. గత కొద్ది రోజులుగా పట్టణంలో సేకరించిన చెత్తను తీసుకొని వచ్చి పర్యాటక గ్రామమైన అమరగిరి రోడ్డుపై వేయడంతో దుర్గంధం వెదజల్లుతుంది.
ఆహ్లాదకరమైన వాతావరణంలో నల్లమల్లలో వనమూలికలు ఉన్న చెట్ల మధ్యన ప్రయాణం చేస్తూ స్వచ్ఛమైన గాలిని పిలుస్తామని భావించిన పర్యాటకులకు దుర్గంధమైన వాసనతో పర్యాటక గ్రామం స్వాగతం పలుకుతుంది. దీంతో పర్యాటకులు అమరగిరి అందాలను చూడకుండానే వెనక్కి తిరిగి పోతున్నట్లు తెలుస్తుంది.
ఎన్నోసార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకొని వచ్చిన చెత్తను రోడ్డుపై వేయడంతో గ్రామానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా తగ్గుతుందని.. దీంతో తమ ఉపాధి దెబ్బతింటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి పర్యాటక గ్రామమైన అమరగిరి ప్రధాన రోడ్డు వెంట ఉన్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించాలని గ్రామ యువకుడు భరత్ డిమాండ్ చేశారు.
BRS : కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ అండ : రావులపల్లి రాంప్రసాద్
TTD | టీటీడీకి తిరుమల విద్యా సంస్థల చైర్మన్ భారీ విరాళం
Road Accident | సికింద్రాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి