Rajamouli | కెరీర్ ఎలా మొదలుపెట్టామనేది కాదు.. ఎలా ముందుకు తీసుకెళుతున్నామనేది ముఖ్యం. ఈ విషయంలో రాజమౌళి ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే చాలామంది దర్శకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఒకప్పుడు టాలీవుడ్‌ను మాత్రమే ఊపేసిన ఈయన.. ఇప్పుడు ప్రపంచం మొత్తం తన సినిమాల గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాడు. బాహుబలితోనే తన స్థాయి ఏంటో ప్రపంచానికి చూపించిన రాజమౌళి.. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఏకంగా ప్రపంచ సినిమాకు సరికొత్త బొమ్మ చూపిస్తున్నాడు. ఈ సినిమా విడుదలై దాదాపు పది నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ ప్రపంచం దీని గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాడు దర్శకధీరుడు. అంతేకాదు గత కొన్ని నెలలుగా ఇండియా కంటే ఎక్కువగా అమెరికాలోనే ఉంటున్నాడు. రెండో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా ట్రిపుల్ఆర్ సినిమాకు రావడంతో.. నెక్స్ట్ ఆస్కార్ మీద ఆశలు పెంచుకుంటున్నాడు రాజమౌళి.
జనవరి 24న మిగిలిన కేటగిరీలకు సంబంధించిన షార్ట్ లిస్ట్ విడుదల కానుంది. దాంతో మరో రెండు మూడు రోజుల్లో ఇంకోసారి అమెరికా వెళ్లడానికి ప్లానింగ్ చేసుకుంటున్నాడు రాజమౌళి. దానికి తోడు అక్కడ జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ లాంటి దర్శకులను కలిసిన తర్వాత రాజమౌళిని కూడా హాలీవుడ్ పురుగు కుట్టేసింది. దాంతో తర్వాత చేయబోయే సినిమాలు కచ్చితంగా హాలీవుడ్ స్థాయిలోనే ఉండాలని ఫిక్స్ అయిపోయాడు జక్కన్న. దీనికి మహేశ్‌బాబు సినిమాను పునాదిగా చేసుకుంటున్నాడు. ఈ సినిమా కోసం ఇండియన్ టెక్నీషియన్స్ కంటే ఎక్కువగా హాలీవుడ్ వాళ్లే పని చేస్తున్నారు. దానికి తోడు నటులను కూడా అక్కడి నుంచే ఇంపోర్ట్ చేసుకోవాలని చూస్తున్నాడు రాజమౌళి.
మొన్నటి వరకు మహేశ్ సినిమా కోసం రూ.500 కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పిన రాజమౌళి.. ఇప్పుడు నో బడ్జెట్ లిమిట్ అంటున్నాడు. ఎన్ని కోట్లు అయినా పెట్టడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని రాజమౌళి బలంగా నమ్ముతున్నాడు. అందుకే మహేశ్ బాబు సినిమాను పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా చేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఇది ఇండియన్ సినిమాగా కాదు ఇంటర్నేషనల్ ప్రాజెక్టుగా రాబోతుంది. దానికి తగ్గట్టుగానే కథను కూడా ఎంచుకుంటున్నాడు రాజమౌళి. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ స్టోరీగా మహేశ్ బాబు సినిమా రాబోతుంది. తన నెక్స్ట్ సినిమా కథను అవతార్ దర్శకుడికి కూడా ఈమధ్య చెప్పాడు రాజమౌళి. ఏదేమైనా మహేశ్ సినిమా తర్వాత పూర్తిగా హాలీవుడ్లో సెటిల్ అయిపోవాలని ప్లాన్స్ వేస్తున్నాడు దర్శకధీరుడు.
Arjun Das | ఇక నెగెటివ్ పాత్రలు చేయను.. బుట్ట బొమ్మ యాక్టర్ అర్జున్ దాస్ చిట్ చాట్
Amigos | కల్యాణ్ రామ్ అమిగోస్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్
Waltair Veerayya | ఇదీ బాస్ కమ్ బ్యాక్ అంటే.. 4 రోజుల్లోనే ఊచకోత..!