Priyanka Chopra | దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం అదరగొడుతోంది. గతేడాది విడుదలైన ఈ చిత్రం భాషతో సంబంధం లేకుండా దూసుకెళ్తూ కోట్లు వసూలు చేసింది. మరోవైపు అంతర్జాతీయంగానూ సత్తా చాటుతోంది. ఇప్పటికే ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’.. చలన చిత్ర రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌కు పోటీపడుతోంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా లాస్ఏంజెల్స్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్‌లో గ్లోబల్ స్టార్, బాలీవుడ్ స్టార్ నటి అయిన ప్రియాంక చోప్రా తళుక్కున మెరిసింది. రాజమౌళి, ఎంఎం కీరవాణిని కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రియాంక ట్విట్టర్లో పోస్టు చేసింది. ‘ఈ అత్యద్భుతమైన భారతీయ చలనచిత్ర ప్రయాణానికి నా వంతుగా సహకరించగలను’ అని పోస్ట్ చేసింది.
కాగా, ఆస్కార్స్ 2023లో మొత్తం 14 కేటగిరీలకు ‘ఆర్ఆర్ఆర్’ దరఖాస్తు చేసుకుంది. అయితే జనవరి 24వ తేదీన ఆస్కార్స్ తుది నామినేషన్ల జాబితాను రిలీజ్ చేస్తారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటునాటు పాటకు ఆస్కార్ దక్కే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Least I can do to contribute to this incredible Indian film’s journey. Good luck and congratulations @RRRMovie, @ssrajamouli garu, @mmkeeravaani garu, @AlwaysRamCharan, @tarak9999, @aliaa08, @ajaydevgn, Prem Rakshith, Kaala Bhairava, Chandrabose, @Rahulsipligunj #RRRMovie pic.twitter.com/nBo5NgctDD
— PRIYANKA (@priyankachopra) January 18, 2023