Arjun Das | ఇక నెగెటివ్ పాత్రలు చేయను.. బుట్ట బొమ్మ యాక్టర్ అర్జున్ దాస్ చిట్ చాట్
అర్జున్ దాస్ (Arjun Das), అనిఖా సురేంద్రన్ (Anikha Surendran) కాంబినేషన్లో వస్తున్న చిత్రం బుట్టబొమ్మ (Butta Bomma). జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై తెరకెక్కుతుంది.
సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ (Arjun Das), అనిఖా సురేంద్రన్ (Anikha Surendran) కాంబినేషన్లో వస్తున్న చిత్రం బుట్టబొమ్మ (Butta Bomma). శౌరి చంద్రశేఖర్ టీ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై తెరకెక్కుతుంది. ఈ నేపథ్యంలో అర్జున్ దాస్ మీడియాతో చిట్ చాట్ చేశాడు. బుట్ట బొమ్మ విశేషాలు అర్జున్ దాస్ మాటల్లోనే..
మీ సినీ ప్రయాణం గురించి..
ఫిలిం ఇండస్ట్రీలో పదేళ్లకుపైగా అద్భుతమైన ప్రయాణం కొనసాగుతుంది. లోకేశ్ కనగరాజ్ నాపై ఉంచిన నమ్మకం వల్లే నేనిలా మీ ముందున్నా. విజయ్-లోకేశ్ మాస్టర్ సినిమాలో భాగంగా చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన వంశీకి ధన్యవాదాలు. తెలుగు ప్రేక్షకులు బుట్టబొమ్మలో నన్ను ఇష్టపడతారని ఆశిస్తున్నా.
బుట్ట బొమ్మ గురించి ఏం చెప్తారు..?
బుట్ట బొమ్మ కప్పెల రీమేక్ అని మీ అందరికీ తెలుసు. ఈ సినిమాలో నా పాత్ర పేరు ఆర్కే. నేనిందులో ఎలాంటి పాత్రలో నటిస్తున్నది మాత్రం చెప్పలేను. ప్రస్తుతానికి ఇంతకంటే ఏం చెప్పలేను. ఏదైనా చెప్తే మీరంతా సినిమాలోని థ్రిల్‌ను మిస్ అవుతారు.
ఈ సినిమాలో నటించాలనిపించేందుకు కారణం..?
ఎలాగైనా సరే నిర్మాత నేను ఈ సినిమాలో ఉండాలని ఫిక్స్ అయ్యారు. డైరెక్టర్ రమేశ్ జీ చెన్నైకి వచ్చిన కథ వినిపించారు. తెలుగు వెర్షన్లో కొన్ని మార్పులు ఉంటాయి. టాప్ ప్రొడక్షన్ బ్యానర్ల నుంచి అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ బ్యానర్లో మరో సినిమా చేసేందుకు కూడా చర్చలు కొనసాగుతున్నాయి.
మీకు నెగెటివ్ రోల్స్ ఎక్కువగా ఎందుకిష్టం..?
మీరు ఈ ప్రశ్న డైరెక్టర్లను అడగాలి. ఒకవేళ లోకేశ్ సార్ అయితే నేను ఎక్కువ ప్రశ్నలు అడగను. ఆయన నన్ను ఓ మూలకు నిల్చోమని అడిగినా.. అలాగే చేస్తా. లోకేశ్ సార్ సినిమాల్లో చిన్న పాత్ర అయినా చేస్తా. కానీ ఇప్పటి నుంచి నెగెటివ్ పాత్రలు చేయను.
బుట్ట బొమ్మలో మీ పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నారా..?
ఈ సినిమాకు నా డబ్బింగ్ విషయంలో వంశీగారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఖైదీ, మాస్టర్ డబ్బింగ్ వెర్షన్లకు ప్రేక్షకులు నీరాజనం పలికారు. తెలుగు ప్రేక్షకుల ప్రేమను తిరిగి పొందేందుకు ఈ సారి డబ్బింగ్ చెప్పడం నా తొలి అడుగుగా భావిస్తున్నా.
మీ వాయిస్ మీ అవకాశాలను పరిమితం చేస్తుందనుకుంటున్నారా..?
ప్రేక్షకులు నేను యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలు మాత్రమే చేస్తానని అనుకోవచ్చు. అయితే ఓ యాక్టర్‌ను రిపీటెడ్ పాత్రల్లో నటిస్తున్నపుడు వారికి ఒక అవగాహన వస్తుంది. కానీ నేను సరళమైన పాత్రలు కూడా చేసేందుకు ప్రయత్నిస్తున్నా. భవిష్యత్‌లో విభిన్న సినిమాలు చేయాలనుకుంటున్నా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

