చిరంజీవి (Chiranjeevi) పని అయిపోయింది.. ఇక ఆయన రిటైర్ కావాల్సిందే.. ఇప్పుడు ఆయన సినిమా వచ్చినా మునుపటిలా ప్రేక్షకులు చూడడం లేదు.. అభిమానులు కూడా ఆయనను అంతగా ఇష్టపడడం లేదు.. ఒకప్పుడు చిరంజీవి సినిమా వస్తే కలెక్షన్స్ ప్రభంజనంలా వచ్చేవి.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు.. పైగా ఆయన మార్కెట్ కూడా పడిపోయింది.. ఇలా కొన్ని రోజులుగా చిరంజీవి మార్కెట్ గురించి.. ఆయన ఇమేజ్ గురించి ఎన్నో సందేహాలు వచ్చాయి.
నాలుగు రోజుల్లోనే..
గత మూడు సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ చూసిన తర్వాత నిజంగానే చిరంజీవి మార్కెట్ పడిపోయిందా అనే అనుమానాలు కూడా ఎక్కువ అయిపోయాయి. ఇలాంటి సమయంలో విడుదలైన వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) అన్ని సందేహాలకు సమాధానం ఇచ్చింది. రొటీన్ ఎంటర్టైనర్.. ఎలాంటి కొత్తదనం లేదు.. చిరంజీవి కూడా ఈ సినిమాను కాపాడలేడు అనే టాక్ నుంచి మొదలైన ఈ సినిమా.. నాలుగు రోజుల్లోనే 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి మెగాస్టార్ మేనియా ఏంటో చూపించింది.
మళ్లీ చిరంజీవి ఇమేజ్ పై ఎవరికి అనుమానాలు లేకుండా చేసింది వాల్తేరు వీరయ్య. పండగ నాలుగు రోజులు ఈ సినిమా మామూలుగా సందడి చేయలేదు. ఒకప్పటిలా చిరంజీవి కోసం ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు కదిలారు. ఒకప్పుడు మెగాస్టార్ సినిమా విడుదలయితే అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ కు వచ్చే వాళ్ళు.. కానీ కొన్ని సంవత్సరాలుగా అది జరగడం లేదు. గత మూడు సినిమాలలో మిస్ అయిన మ్యాజిక్ వాల్తేరు వీరయ్యలో చూపించాడు దర్శకుడు బాబి.
మ్యాజిక్ చేస్తున్న చిరంజీవి..
చిరంజీవిని అభిమానులు ఎలాగైతే చూడాలని కలలు కంటున్నారో అచ్చం అలాగే చూపించాడు. దాంతో అభిమానులతోపాటు కుటుంబ ప్రేక్షకులు కూడా థియేటర్స్ వైపు అడుగులు వేస్తున్నారు. అందుకే ఎదురుగా మూడు భారీ సినిమాలు పోటీలో ఉన్నా కూడా వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ దగ్గర సంచలన కలెక్షన్స్ సాధిస్తుంది.
రొటీన్ సినిమా అని ముద్ర పడినా కూడా.. ఒకప్పటిలా చిరంజీవి మ్యాజిక్ చేస్తున్నాడు. ఇదే జోరు మరో వారం రోజులు కంటిన్యూ అయితే 200 కోట్ల క్లబ్బులో చేరడం ఖాయం. తన నుంచి అభిమానులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో వాల్తేరు వీరయ్య ఫలితం చూసిన తర్వాత చిరంజీవికి కూడా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది.
Read Also : Dhamki | ధమ్కీ నుంచి మావా బ్రో సాంగ్ రిలీజ్ టైం ఫిక్స్
Read Also : Arjun Das | ఇక నెగెటివ్ పాత్రలు చేయను.. బుట్ట బొమ్మ యాక్టర్ అర్జున్ దాస్ చిట్ చాట్
Read Also : Michael | మైఖేల్ నుంచి ది మ్యాడ్ క్వీన్ అనసూయ భరద్వాజ్ లుక్