Michael | మైఖేల్ నుంచి ది మ్యాడ్ క్వీన్ అనసూయ భరద్వాజ్ లుక్
ఇప్పటికే విడుదలైన మైఖేల్ టీజర్, నీవుంటే చాలు సాంగ్ లిరికల్ వీడియో సాంగ్ మూవీ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తోంది. ఇటీవలే మైఖేల్ షూటింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో మైఖేల్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు మేకర్స్.
యువ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం మైఖేల్ (Michael). విజయ్ సేతుపతి మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన మైఖేల్ టీజర్, నీవుంటే చాలు సాంగ్ లిరికల్ వీడియో సాంగ్ మూవీ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తోంది. ఇటీవలే మైఖేల్ షూటింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో మైఖేల్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా నేటి నుంచి సినిమాలోని ఒక్కో పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
నేడు మైఖేల్ సినిమా నుంచి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)ఫస్ట్ లుక్‌ను పరిచయం చేశారు. అనసూయ భరద్వాజ్ మైఖేల్ చిత్రంలో చారులతగా కనిపించనుంది. నలుపు రంగు చీరలో మ్యాడ్ క్వీన్‌గా అగ్రెసివ్ లుక్‌లో కనిపిస్తుంది అనసూయ. మైఖేల్‌లో గౌతమ్ వాసుదేవ్ మీనన్, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. మైఖేల్‌లో దివ్యాంక కౌశిక్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రంజిత్ జయకోడి డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్లపై పీ రామ్మోహన్ రావు, భరత్ చౌదరీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైఖేల్ తెలుగు,తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఫిబ్రవరి 3న గ్రాండ్‌గా విడుదల కానుంది.
ది మ్యాడ్ క్వీన్ అనసూయ లుక్..
She is Full of Pride & Regality Personified!
Introducing @anusuyakhasba as
THE MAD QUEEN ‘Charulatha’ from the world of #Michael❤️🔥#MichaelFromFeb3rd@sundeepkishan @VijaySethuOffl @Divyanshaaaaaa @jeranjit @menongautham @SamCSmusic @Dir_Lokesh @SVCLLP @KaranCoffl pic.twitter.com/MBH0R8DDmD— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) January 18, 2023
నీవుంటే చాలు లిరికల్ వీడియో సాంగ్..
మైఖేల్ టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

