సీఈవో పే: టిమ్ కుక్కు 171వ ర్యాంక్.. ఎలాగంటే..!!
సీఈవో పే: టిమ్ కుక్కు 171వ ర్యాంక్.. ఎలాగంటే..!! టాప్-500 కంపెనీల సీఈవోల వేతనాలతో పోలిస్తే టిమ్ కుక్ 171 ర్యాంక్ పొందారు. పేకామ్ సీఈవో చాద్...

న్యూయార్క్: ఒక కార్పొరేట్ సంస్థకు సీఈవో అంటే.. వేతన భత్యాలు.. ఇతర ఖర్చులు అన్నీ సంస్థ యాజమాన్యానివే.. హోదా కూడా బాగానే ఉంటుంది. అదే టెక్ దిగ్గజం ఆపిల్ సీఈవో అంటే ఇక మాటల్లో చెప్పేదేముంది.. ఇదంతా ఆపిల్ సీఈవో టిమ్ కుక్ తీసుకునే వేతనం గురించే.. కానీ ప్రపంచంలోని టాప్-500 కంపెనీల సీఈవోల వేతనాలతో పోలిస్తే టిమ్ కుక్ 171 ర్యాంక్ పొందారు.
స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్ అండ్ పీ) -500 కంపెనీల మార్కెట్ క్యాపిటల్ ప్రకారం ఆపిల్ టాప్‌లోనే ఉంది. కానీ ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ నేరుగా తీసుకునే వేతనం ఇతర సంస్థల కంటే చాలా తక్కువ అని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ వార్తా కథనం ప్రచురించింది.
ప్రపంచంలోనే భత్యాలతోపాటు మొత్తం వేతనం 211 మిలియన్ల డాలర్లు తీసుకుంటున్న పేకామ్ సీఈవో చాద్ ఆర్.రిచిసన్ కంటే టిమ్ కుక్ చాలా వెనుక బడి ఉన్నారు. అడోబ్ సీఈవో శంతను నారాయణ్ 45 మిలియన్ల డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు.

23 మిలియన్ల డాలర్లతో పేపాల్ సీఈవో 49వ స్థానంలో, ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ 17 మిలియన్ల డాలర్ల వేతనంతో 122వ స్థానంలో నిలిచారు.
వారెన్ బఫెట్ 3,80,328 డాలర్లతో 413వ ర్యాంక్, ట్విట్టర్ అధినేత జాక్ డోర్సీ కేవలం ఒక డాలర్‌తో 414వ ర్యాంక్, వేతనం లేని సీఈవోగా టెస్లా సీఈవో ఎలన్ మస్క్ తర్వాతీ స్థానంలో ఉన్నారు.
టాప్-500 కంపెనీల సీఈవోల డేటా ప్రకారం ఆపిల్ సీఈవోగా టిమ్ కుక్ తీసుకుంటున్న కాంపెన్సేషన్ పే గతేడాది 1,47,69,259 డాలర్లు మాత్రమే. చూడటానికి ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్న 2019 కాంపెన్సేషన్ పేతో పోలిస్తే 28 శాతం పెరిగింది. అందువల్లే టిమ్‌కుక్ 171వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంటున్నారు.
మిగతా ప్రధాన సంస్థల సీఈవోల మాదిరిగానే టిమ్ కుక్ వేతనాన్ని తీసుకుంటున్నారని ర్యాంకులు చెబుతున్నాయి. కానీ టిమ్ కుక్‌తోపాటు పలు సంస్థల సీఈవోలు.. ఆయా కంపెనీల వాటాదారులకు సారధ్యం వహిస్తారు. దీంతో వారి మొత్తం ఆదాయంలో వేతనం చాలా తక్కువగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
దేశ ప్రజలందరికీ ఉచితంగానే టీకాలు ఇవ్వండి.. కోవిడ్ నుంచి కోలుకుంటూ కేంద్రానికి థరూర్ విజ్ఞప్తి
ఆన్లైన్ క్లాస్ వినాలంటే ఆరు కిలోమీటర్లు నడవాల్సిందే
22 కోట్ల కోవాగ్జిన్ టీకాలను ఉత్పత్తి చేయనున్న ముంబై కంపెనీ
మరో వైరస్ కలకలం.. దేశంలో తొలిసారిగా స్కిన్ బ్లాక్ ఫంగస్ కేసు గర్తింపు
అంబులెన్సుల దందా.. 40 కి.మీటర్లకు రూ.17 వేలు
న్యూయార్క్ కన్నా ముంబైలో రెట్టింపు!
రాందేవ్ బాబా దేశ వ్యతిరేకి : ఐఎంఏ
ఎస్పీఎస్ఎన్ లో 11 జూన్ నుంచి అతిపెద్ద అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్స్ లైవ్..
నో డౌట్: ఇప్పట్లో లీటర్ పెట్రోల్ రూ.100 తగ్గదు..!!
విదేశీ వ్యాక్సిన్లకు ఆ రక్షణ కల్పించడానికి సిద్ధం!
పాక్‌తో కలిసి వాస్తవాధీన రేఖ వద్ద మిస్సైళ్లను పరీక్షిస్తున్న చైనా
పాకిస్థాన్‌లో మ్యూజియాలుగా రాజ్‌కపూర్, దిలీప్‌కుమార్ ఇళ్లు
అతిపెద్ద మాంస విక్రయ సంస్థపై సైబర్ దాడి..
ఆ ఒక్క కరోనా వేరియంటే ఆందోళన కలిగిస్తోంది: డబ్ల్యూహెచ్‌వో
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

