హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): యూరియా, ఇతర సబ్సిడీ ఎరువులు రైతులకు పారదర్శకంగా, అవసరమైన మేరకు అందించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన యాప్ను రద్దు చేసే ప్రసక్తే లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. యాప్ అమలులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిషరిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో రైతులకు మరింత సులభంగా, సమర్థవంతంగా సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
శాసనమండలిలో ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, శ్రీపాల్రెడ్డి, తీన్మార్ మల్లన్న లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. గతంలో ఆధార్ ఆధారంగా ఎరువుల పంపిణీ జరిగేదని తెలిపారు. పారదర్శకం గా, అవసరమైన మేరకు సబ్సిడీ యూరి యా నిజమైన రైతులకు అందించేందుకు ప్రభుత్వం రబీ 2025-26లో ‘యూరియా బుకింగ్ యాప్’ను తీసుకొచ్చిందని వివరించారు. స్మార్ట్ఫక్షన్ లేని రైతులు కూడా ఎరువులు బుకింగ్ చేసుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని తెలిపారు. కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా రైతులు ఎరువులు బుక్ చేసుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎకడైనా యూరియా ధర ఒకేవిధంగా ఉండే లా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.