హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో వరుస పరిణామాలపై సమగ్ర దర్యాప్తునకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఎంతటివారినైనా ప్రభు త్వం విచారణ చేపట్టి శిక్షించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
కుట్రలు పన్నినవారితోపాటు కుట్రలో భాగస్వాములైన వారిని చట్టపరిధిలో శిక్షిస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 6 నుంచి జరిగిన అన్ని ఘటనలను క్రోడికరించి అందరిపై సంపూర్ణ విచారణ చేసి, క్రిమినల్ కేసులు పెట్టనున్నట్టు వెల్లడించారు. ఘటనలపై సమగ్ర దర్యాప్తు కోసం అధికారి విజయ్‌కుమార్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించారు.