మోకీ (చైనా) : జూనియర్ ఆసియా కప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు దుమ్మురేపింది. గోల్స్ వర్షంతో తడిసి ముద్దయిన పోరులో భారత్ 15-0తో చైనీస్ తైపీని చిత్తుగా ఓడించి సెమీస్‌కు చేరుకుంది. భారత జట్టులో కెప్టెన్ అన్మోల్ ఎక్కా (25, 29, 32, 33, 45, 51వ నిమిషాల్లో) ఆరు గోల్స్‌తో రెచ్చిపోగా ఆర్యన్ (17, 52, 53) మూడు గోల్స్ చేశాడు. హర్పాల్ (48, 53) రెండు గోల్స్‌తో మెరిశాడు. అమ్మాయిల విభాగంలో చైనాతో జరిగిన తమ ఆఖరి పూల్ మ్యాచ్‌ను డ్రా చేసుకున్న భారత్.. క్వార్టర్స్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది.