దేశంలో మహిళా విద్య, సామాజిక సంస్కరణలకు అలుపెరుగని కృషి చేశారు మహాత్మా జ్యోతిరావు, సావిత్రిబాయి ఫూలే దంపతులు. వారి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. అంతటి మహనీయులకు.. గొప్ప సంఘ సంస్కర్తలకు ఘోర అవమానం జరిగింది.
హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉన్న జ్యోతిరావు ఫూలే దంపతుల విగ్రహాల వద్ద చెత్తకుప్పలను పారబోశారు. ఇలా వ్యర్థాలను ఆ దంపతుల విగ్రహాల వద్ద వేయడమే ఒక పెద్ద తప్పయితే.. వాటిని తొలగించి.. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన సోయి.. మన ‘ప్రజా పాలన’ పెద్దలకు లేకుండాపోవడం మహాతప్పిదం.