MLC Tata Madhusudan | ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై పెట్టే అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ (MLC Tata Madhusudan) అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండల పరిధిలోని జిల్లా సబ్ జైలును భద్రాద్రి కొత్తగూడెం గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దుండిగల్ రాజేందర్, రూరల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్‌తో కలిసి సందర్శించారు.
గత కొద్ది రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి సొసైటీ అధ్యక్షుడు లక్కినేని సురేందర్ భూక్యరాజులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం తాతా మధుసూదన్ పార్టీ నాయకులతో కలిసి జిల్లా జైల్లో ఉన్నటువంటి లక్కినేని సురేందర్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు భూక్యరాజులను ములాఖత్ ద్వారా కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ చూసుకొని ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. కొంతమంది పోలీసు అధికారులు అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలికి అక్రమ కేసులు పెడుతున్నారని, రాబోయే రోజుల్లో వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. లగచర్ల బాధితులకు బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ ఎలా అండగా ఉండి న్యాయపోరాటం చేసి విజయం సాధించారో అదే స్ఫూర్తితో జిల్లాలో సైతం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జయరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Mancherial | కోనూర్‌లో విషాదం.. పంట చేను కోసం ఏర్పాటుచేసిన విద్యుత్ వైరుకు రైతు బలి
Maha Kumbh | మహాకుంభమేళాలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 43 కోట్ల మంది పుణ్యస్నానాలు