హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌కు మహిళా రిజర్వేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి చేసింది. గురువారం మహిళా సంఘాల ప్రతినిధులు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు.
వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లను జనగణన, డీలిమిటేషన్ నుంచి వేరుచేసే సవరణను తీసుకువచ్చేలా పార్లమెంట్లో చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారిలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్ అరుణజ్యోతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తదితరులు ఉన్నారు.