బీఆర్ఎస్ నాయకుల ఓట్లు తొలిగించే కుట్ర
చెన్నూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులతో పాటు వారి కుటుంబ సభ్యుల ఓట్లు తొలిగించే కుట్రలు జరుతున్నాయనే అనుమానాలున్నాయని ఆ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కలగూర రాజకుమార్ పేర్కొన్నారు. గురువారం భీమారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన నాయకులతో మాట్లాడారు.
- పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కలగూర రాజకుమార్
భీమారం, జూలై 16: చెన్నూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులతో పాటు వారి కుటుంబ సభ్యుల ఓట్లు తొలిగించే కుట్రలు జరుతున్నాయనే అనుమానాలున్నాయని ఆ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కలగూర రాజకుమార్ పేర్కొన్నారు. గురువారం భీమారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన నాయకులతో మాట్లాడారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బీఎల్వోలు ప్రతీ ఓటర్ ఇంటికి వెళ్లి, అసరమైన ఫారాలు నింపించి, వాటికి సంబంధించిన రిసీవ్డ్ కాపీని ఓటర్లకు అందజేయాల్సి ఉందని, దీనికి విరుద్ధంగా భీమారం గ్రామ పంచాయతీతో పాటు పలు ప్రాంతాల్లో ఈ నిబంధనలు అమలు కావాడం లేదన్నారు.
అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత మాత్రమే ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వడం జరుగుతుందని, కాంగ్రెస్ నాయకులకు బీఆఎల్వోలకు మాత్రమే ఫారాలు అందించి ఇతర రాజకీయ పార్టీలకు బీఎల్వోలు సమాచారం అందించడం లేదన్నారు. భీమారం గ్రామ పంచాయతీలో బీఎల్వోలు ఓకేచోట కుర్చోబెట్టి అక్కడికే రమ్మని చెబుతున్నారన్నారు. కార్యక్రమంలో ధర్మారం సర్పంచ్ దాసరి మణిదీపక్, మాజీ వైస్ ఎంపీపీ సమ్మయ్య, సీనియర్ నేతలు చిప్ప పురుషో త్తం, సూరం లచ్చన్న, యువ నాయకులు కుంబ్రే బబ్లు, మాజీ వార్డు సభ్యు డు పూజరి కృష్ణ, ఆరెపల్లి రాజబాబు, చకినారపు రాజబాపు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
- Tags
- BRS leaders
- remove votes
- votes
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

