జమ్మికుంట రూరల్ : కులవృత్తులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచి గౌడ కులస్తులకు పూర్వ వైభవం తీసుకు వచ్చిందని వర్దన్నపేట్ ఎమ్మెల్యే మండల ఇంచార్జ్ ఆరూరి రమేశ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని మడిపల్లి గ్రామంలో గౌడ కులస్తుల ఆత్మీయ సమావేశాన్ని శుక్రవారం ఎమ్మెల్యే నిర్వహించారు. సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గీతన్నలు ఘన స్వాగతం ఫలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గీతన్నల తలరాత మార్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని అన్నారు. గౌడన్నలు ప్రమాదవశాత్తు మరణీస్తే ఎక్స్‌గ్రేషియా ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. సీఎం కేసీఆర్‌కు గౌడ కులస్తులంటే గౌరవం ఉందన్నారు. నియోజకవర్గంలోని సర్పంచులను, ఎంపీపీలు, జడ్పీటీసీలను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేసింది ఈటల కాద అని ప్రశ్నించారు.
అభివృద్దిని పట్టించుకోని ఈటల వ్యక్తిగత ప్రయోజనం కోసం బీజేపీ పార్టీలో చేరరన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు సీనును ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లా డుతూ..గౌడన్నలు కలసికట్టుగా టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ పరుశురాములు, తెలంగాణ గాయకుడు సాయి చంద్ , గౌడ సంఘం రాష్ట్ర అద్యక్షుడు లక్ష్మణ్‌గౌడ్, ఎమ్మార్సీఎస్ టీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తునిక వసంత్, నాయకులు వోలాల సాంబయ్య, పావని గౌడ్, సంజయ్, చిరంజీవి, మహేందర్ , ఐలయ్య,కుమార్, శ్రీనివాస్, మధు, రామరాజు, యాదగిరి, రాజయ్యలతోపాటు తదితరులు పాల్గొన్నారు.