-పద్మశాలీ ఆత్మ గౌరవ భవనం కోసం ఎకరం భూమితో పాటు 1 కోటి నిధులు మంజూరు..
-నిఖార్సయిన బీసీ బిడ్డ గెల్లు శ్రీను.. పావలా బీసీ ఈటల..
-ప్రజా వ్యతిరేక బీజేపీ పార్టీకి రానున్న ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి..
-తెరాస కు ఓటేస్తామని పద్మశాలీల ఏకగ్రీవ తీర్మానం..
-హుజూరాబాద్ పద్మశాలి ఆత్మీయ సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్..

హుజూరాబాద్ : పద్మశాలీల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉంటామని పద్మశాలీలు హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.మంగళవారం హుజూరాబాద్ సిటీ సెంటర్ హాల్ లో పద్మశాలీల ఆత్మీయ సమ్మేళన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు శ్రీనివాస్ తో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ పద్మశాలీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని… పద్మశాలి కుల బాంధవులు ఏకతాటిపై నిలిచి తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచి …టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు… హుజూరాబాద్ పట్టణంలో పద్మశాలీల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఒక ఎకరం భూమి తో పాటు ఒక కోటి ప్రభుత్వం నిధులు కేటాయించిందని మంత్రి గంగుల గుర్తు చేశారు… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మశాలీల సంక్షేమ పథకాలకు పెండింగ్ లో ఉన్న 74 కోట్ల నిధులు కూడా మంజూరు చేస్తూ జీవో జారీ చేసిందని తెలిపారు.

20 ఏండ్లగా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ పద్మశాలీల సంక్షేమాన్ని విస్మరించారని… ఆత్మగౌరవ భవన నిర్మాణానికి భూమి అడిగితే ఈటల పట్టించుకోలేదని అన్నారు… టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు శ్రీనివాస్ నికార్సయిన బీసీ బిడ్డని… ఈటల పావలా బీసీఅని… హుజూరాబాద్ లో బీసీ హైదరాబాదులో రెడ్డి అని ఎద్దేవా చేశారు… బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి పట్టం కట్టాలని మంత్రి పిలుపునిచ్చారు… గెల్లు శ్రీనివాస్ గెలుపులో ప్రతి పద్మశాలీ బిడ్డ పాలు పంచుకోవాలని … టీఆర్ఎస్ కు ఓటేస్తే అభివృద్ధికి ఓటేసినట్టేనని మంత్రి గుర్తు చేశారు… ప్రజా వ్యతిరేక బీజెపీ పార్టీకి రానున్న ఉప ఎన్నికల్లో పద్మశాలీలు గట్టిగా బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు.

20 ఏండ్లుగా చేయని అభివృద్ధి ఉప ఎన్నికల్లో గెలిచి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఏం చేస్తాడని ప్రశ్నించారు.. పద్మశాలీలు ఆర్థికంగా ఎదిగేందుకు 1లక్ష వ్యక్తిగత రుణాల మంజూరు ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి పేర్కొన్నారు… పద్మశాలీ వ్యాపారస్తులు ఊరూరా తిరిగి బట్టలు అమ్ముకునేందుకు వీలుగా టూవీలర్ మొపైడ్ వాహనాలను అందజేసేoదుకు కృషి చేస్తామని పునరుధ్ఘటించారు.. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ నాయకులు స్వర్గం రవి , వాసాల రమేష్, మెతుకు సత్యం తదితరులు పాల్గొన్నారు