న్యూఢిల్లీ: ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2400 మందికి పైగా భారతీయులను అమెరికా బహిష్కరించిందని విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. ఆ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ భారత్ చట్ట విరుద్ధ వలసలకు వ్యతిరేకమని, చట్టబద్ధంగా ప్రజలు వలస వెళ్లే మార్గాలను ప్రోత్సహించాలనుకుంటోందని తెలిపారు.
జనవరి నుంచి ఇప్పటివరకు 5,417 మంది భారతీయులు అమెరికా నుంచి బహిష్కరించబడ్డారని లేదా స్వదేశానికి పంపించివేయబడ్డారని ఆయన తెలిపారు.