ఖైరతాబాద్, జూలై 2 : ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని 62.7 ఎకరాల భూదాన్ భూమిని కబ్జా చేసేందుకు అధికార పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు కుట్రలు చేస్తున్నారని గ్రామీణ పేదల సంఘం ఆరోపించింది. ఈ భూముల వ్యవహారంలో తప్పుడు లెక్కలు చూపుతున్నారని పేర్కొన్నది. ఈ భూమికి వెంటనే హద్దులు నిర్ణయించి బాధితులకు అప్పగించాలని డిమాండ్ చేసింది.
గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు యర్రయ్య, వెంకటాద్రి మాట్లాడుతూ.. ‘తక్షణమే 62.7 ఎకరాల భూమిని తిరిగి బాధితులకు అప్పగించాలి. కూల్చివేతల చోటే ఇండ్లు నిర్మించాలి. కూల్చివేసిన ఇండ్లకు రూ.25.37 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి. తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలి’ అని డిమాండ్ చేశారు.