న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తీరుపై 12వ తరగతి విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూలై 28వ తేదీన 12వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్ నిర్వహించేందుకు సీబీఎస్ఈ ఏర్పాట్లు చేస్తున్నది. జూన్ 30 నుంచి జూలై 8వరకు విద్యార్థుల వివరాలను సమర్పించాలని కాలేజీలకు సూచించింది.
ఎగ్జామ్ మరీ అంత లేట్‌గా ఎందుకు పెడుతున్నారంటూ విద్యార్థులు మండిపడుతున్నారు. ఫలితాలు వచ్చేసరికి మరింత సమయం పడుతుందని.. ఆలోపు కాలేజీల్లో అడ్మిషన్లు అయిపోతాయని.. ఒక సంవత్సరం వృథా అవుతుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే యూనివర్సిటీల్లో అడ్మిషన్లు సీయూఈటీ-యూజీ ఆధారంగా జరుగుతున్నాయని మరో నెటిజన్ పోస్టు చేశాడు. సప్లిమెంటరీ ఎగ్జామ్ డేట్‌ను ముందుకు జరుపాలని, లేదంటే తాము నష్టపోతామని చెబుతున్నారు.