కోతుల బెడదతో పంటలు పండించలేకపోతున్నం
ఎల్‌నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులాంతా ఆరుతడి పంటలు సాగుచేయాలని మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ రైతులకు సూచించిగా, తాము కోతల బెడదతో చాలారకాల పంటలు సాగుచేయలేక పోతున్నామని రైతులు ఆయన దృష్టికి తెచ్చారు.
- జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ దృష్టికి తెచ్చిన రైతులు
- ఆరుతడి పంటలు పండించాలని సూచించిన మంత్రి
- కోతుల బెడద నివారించాలన్న రైతులు
చేగుంట, జూలై 18: ఎల్‌నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులాంతా ఆరుతడి పంటలు సాగుచేయాలని మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ రైతులకు సూచించిగా, తాము కోతల బెడదతో చాలారకాల పంటలు సాగుచేయలేక పోతున్నామని రైతులు ఆయన దృష్టికి తెచ్చారు. శనివారం మెదక్ జిల్లా చేగుంట రైతు వేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్‌నినో అవగాహన సదస్సుకు మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో కలిసి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది వర్షాలు తక్కువగా కరుస్తాయని నిపుణుల సూచనల నేపథ్యంలో, రైతులు తక్కునీటి వనరులతో పండే పంటలు పండించేలా అవగాహన సదస్సుల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఆరుతడి పంటల సాగు కు కోతుల బెడద ఎక్కువగా ఉంద ని, కోతుల బెడద అరికట్టేందుకు ప్రభు త్వం చొరవ తీసుకోవాలని పలువురు రైతు లు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ప్రత్యామ్నాయ పంటలే ముద్దు
వరి వద్దని, ప్రత్యామ్నాయ పంటలే ముద్దు అనే నినాదంతో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. రైతులందరూ వ్యవసాయ శాఖ సలహాలు, సూచనలు పాటిస్తూ పంటలు సాగుచేసుకోవాలని సూచించారు. తూ ప్రాన్ ఆర్డీవో బావయ్య, మండల ప్రత్యేకాధికారి హేమభార్గవి, మెదక్ జిల్లా వ్యవసాయాధికారి వినయ్‌కుమార్, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్వెంగళ్రావు, సొసైటీ చైర్మన్ మ్యాకల పరమేశ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షురాలు సండ్రుగు స్రవంతిసతీశ్,ఎంపీడీవో చిన్నారెడ్డి, తహసీల్దార్ బాల్‌లక్ష్మి, ఏవో హరిప్రసాద్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

