బెంగళూరు : పసి పిల్లలు అని కూడా చూడకుండా డేకేర్ నిర్వాహకులు అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. పిల్లలు ఏడ్చారనే కోపంతో వాషింగ్‌మెషీన్ ఫ్రంట్ లోడింగ్ డ్రమ్ములో కూర్చోబెట్టారు. బాత్రూమ్లో బంధించారు. జెట్ స్ప్రేతో పిల్లల నోట్లోకి బలవంతంగా నీళ్లు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదంతా బెంగుళూరులోని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ జెమినీ క్యాంపస్-డేకేర్ సెంటర్లో జరిగింది.
తమ ఉద్యోగుల పిల్లల కోసం క్యాప్ జెమినీ డేకర్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఫిర్యాదుదారు ప్రకారం.. తల్లిదండ్రులు పిల్లలను వదిలి వెళ్లినప్పుడు డేకేర్ మహిళలు అత్యంత దారుణంగా తమ ప్రతాపం చూపించారు. పిల్లలు ఏడుస్తున్నారనే కోపంతో వాళ్లను వాషింగ్‌మెషీన్ ఫ్రంట్ లోడింగ్ డ్రమ్ములో కూర్చోబెట్టడం, బలవంతంగా వెస్టర్న్ టాయిలెట్ మీదకు తోయడం, లాంటివి చేశారు. ఈ ఘటనపై డేకేర్‌కు చెందిన ఐదుగురు మహిళలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.