అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పలు నియోజకవర్గాల్లో రెండు గంటల ముందుగానే ప్రచారం(Campaign) ముగిసింది . అరకు (Araku), పాడేరు, రంపచోడవరం(Rampachodavaram) ప్రచారంలో సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రచారాన్ని ముగించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటలకు , మిగతా చోట సాయంత్రం 6 గంటల నుంచి ప్రచారం పరిసమాప్తి కానుంది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు, పాడేరు, రంపచోడవరం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలు కావడంతో ఆ నియోజకవర్గంలో ఈనెల 13న పోలింగ్ రెండు గంటల ముందుగానే ప్రారంభించి, సాయంత్రం నాలుగు గంటలకు ముగించనున్నారు . అదేవిధంగా పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో మరికొద్ది నిమిషాల్లో ప్రచారం ముగియనుంది. మిగతా 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు ప్రచారం సమాప్తం కానున్నది.