కొండచరియలు విరిగిపడి 9 మంది దుర్మరణం
కొండచరియలు విరిగిపడి 9 మంది దుర్మరణం | హిమాచల్‌ప్రదేశ్‌లో కిన్నౌర్ జిల్లాలోని సంగ్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి కిందభాగంలో ఉన్న నదిలో పడిపోయాయి. పలువురు పర్యాటకులు ప్రాణాలు

షిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌లో కిన్నౌర్ జిల్లాలోని సంగ్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి కిందభాగంలో ఉన్న నదిలో పడిపోయాయి. పలువురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు. అలాగే వంతెనతో పాటు వసతి గదులు కూలిపోయాయి. కిన్నౌర్ జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన చిట్కుల్‌కు వెళ్తున్న సమయంలో పర్యాటకుల వాహనంపై బండరాళ్లు వచ్చిపడ్డాయి. తొమ్మిది మంది మృత్యువాతపడగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బండరాళ్ల ధాటికి నదిపై ఉన్న వంతెన సైతం కూలిపోయింది.
ఘటనలో తొమ్మిది మంది మరణించారని, బాట్రేరి వంతెన కూలిపోయిందని చీఫ్ సెక్రెటరీ అనిల్ ఖాదీ ధ్రువీకరించారు. మృతదేహాలను గుర్తించేందుకు, గాయపడిన వారికి అవసరమైన సహాయక సహకారాలు అందించేందుకు ఎమర్జెన్సీ ఆపరేషన్స్ ప్రారంభించినట్లు డెప్యూటీ కమిషన్ అబిద్ హుస్సేన్ తెలిపారు. ఈ మేరకు ఆయన సీనియర్ అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2.15గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎత్తయిన పర్వత ప్రాంతం నుంచి బండరాళ్లు ఒక్కసారిగా కిందకు జారిపడ్డాయి. గతవారం నుంచి భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది.
Valley bridge Batseri in Sangal valley of Kinnaur collapses: Nine tourists from Delhi NCR are reported to be dead and three others are seriously injured pic.twitter.com/gTQNJ141v5
— DD News (@DDNewslive) July 25, 2021
ఇవి కూడా చదవండి..
3 డీ ప్రింటింగ్‌తో కృత్రిమ చెవులు, ముక్కు సృష్టి
Tokyo Olympics: పంచ్ అదిరింది.. మేరీ కోమ్ విజయం
Tokyo Olympics: పిస్టల్‌లో సాంకేతిక లోపం.. మను బాకర్‌కు షాక్
ముగ్గురు ఎల్ఈటీ ఉగ్రవాదులు హతం : కాశ్మీర్ ఐజీ
మరికొద్ది గంటల్లో తేలనున్న యెడియూరప్ప భవిష్యత్!
రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

