హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ)/సిటీబ్యూరో : హైదరాబాద్‌లోని నాగోల్ చౌరస్తాలో దీక్ష జ్ఞాపకాలను ఎల్ఈడీ స్క్రీన్‌పై ప్రదర్శించారు. రెడో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్ఈడీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణవాదులను ఎలా కట్టడి చేశాయి..? ఎలా అడ్డుకున్నాయి..? రాష్ట్ర కాంక్షతో వాటన్నింటిని దాటుకుని కేసీఆర్ ఎలా ఉద్యమాన్ని ముందుకు నడిపించారు? తన ప్రాణాన్ని సైతం ఎలా పణంగా పెట్టారనే విషయాలను స్క్రీన్ ద్వారా అక్కడ ప్రజలు, ఉద్యమకారులకు కండ్లకు కట్టినట్టుగా చూపించారు.
ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణవాదులు, ఉద్యమకారులు ఈ వీడియోలను చూసి భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ ఆమరణదీక్షతోనే ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దిగివచ్చిందని పేర్కొన్నారు. నేటి యువతకు చాలామందికి ఆనాటి ఉద్యమ పరిస్థితుల గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు వై సతీశ్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సతీశ్‌యాదవ్, జగన్ మోహన్, శ్యాం, షఫీ, వెంకట్ రెడ్డి, అనిల్ గౌడ్, కౌశిక్, అశోక్ యాదవ్, నాయకులు పాల్గొన్నారు.