హుస్నాబాద్, నవంబర్ 28: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అందరూ సహకరించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్‌కుమార్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అక్కన్నపేట రోడ్డు యేనె వద్ద డిసెంబర్ 3న సీఎం రేవంత్ బహిరంగ సభ ఏర్పాట్లను శుక్రవారం అధికారులతో కలిసి సీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సర్పంచ్ల ఏకగ్రీవం అనేది నిబంధనల ప్రకారం జరగాలన్నారు.
ఏకగ్రీవం పేరుతో బెదిరింపులకు పాల్పడడం, ప్రలోభాలకు గురిచేయడం చట్టరీత్యా నేరం అన్నారు. అభ్యర్థులు డబ్బులు, భూములు ఆశ చూపి ఏకగ్రీవం కావడం కోసం ప్రయత్నించడం సరికాదన్నారు. సీపీ వెంట ఆర్డీవో రామ్మూర్తి, ఏసీపీ సదానందం, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్‌గౌడ్, స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.