జహీరాబాద్, నవంబర్ 28 : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు జాబితా విడుదల, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు.
సర్పంచు అభ్యర్థులకు సంబంధించి పింక్ కలర్ బ్యాలెట్ పత్రం సిద్ధం చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల గుర్తుల్లో ఉంగరం, కత్తెర, పుట్‌బాల్, బ్యాట్, బ్యాట్‌మెన్, స్టంప్స్, లేడీస్ పర్సు, టీవీ రిమోట్, టూత్‌పేస్ట్, పాన్, చెత్తడబ్బా, బెండకాయ, కొబ్బరి చెట్టు, వజ్రం, నల్లబోర్డు, బకెట్, డోర్ హ్యాండిల్, చేతికర్ర, మంచం, బిస్కెట్, వేణువు, జల్లెడ, పలక, టేబుల్, బ్యాటరీ, లైట్, బ్రష్, పడవ, చైన్, చెప్పులు, గాలిబుడగ వంటివి ఉన్నాయి.
వార్డు సభ్యులకు సంబంధించి తెలుపురంగు బ్యాలెట్ పత్రం సిద్ధం చేస్తున్నారు. వార్డు సభ్యుల గుర్తులు పొయ్యి, స్టూల్, బీరువా, గ్యాస్ సిలిండర్, గౌన్, ఈల, కుండ, గరట, ముకుడు, డిష్ ఏంటీనా, ఐస్‌క్రీమ్, గాజుగ్లాస్, పోస్టుడబ్బా, కవర్, కటింగ్ ప్లేయర్, హాకీ, కర్రబంతి, నైక్టై, విద్యుత్ స్తంభం, షటిల్ గుర్తులు కేటాయించారు.