హైదరాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్అరాధే బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అ య్యారు. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశా రు. ప్రధాన న్యాయమూర్తి బదిలీ కావడం తో తాత్కాలికంగా ఆ బాధ్యతలను రెండో స్థానంలో ఉన్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్‌కు అప్పగిస్తూ ఉత్తర్వు లు వెలువడ్డాయి. జస్టిస్ సుజయ్‌పాల్ 1964 జూన్ 21న జన్మించారు. పండిట్ ఎల్ఎస్ ఝౌ మోడల్సూల్లో ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు చదివారు. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని రాణిదుర్గావతి వర్సిటీలో ఎల్ఎల్బీ, పీజీ పూర్తి చేశారు. 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నా రు. రాజ్యాంగ, పారిశ్రామిక, సివిల్, సర్వీ సు కేసుల్లో రాణించడంతో గుర్తింపు పొం దారు. 2011లో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2024 మార్చి 26న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. ఇప్పుడు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా వ్యవహరించనున్నారు.