హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : వానాకాలం సాగు, తాగునీటి అవసరాల కోసం సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి 148 టీఎంసీలు ఇవ్వాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బోర్డు చైర్మన్కు తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్ లేఖ రాశారు.
కల్వకుర్తి లిఫ్ట్ ద్వారా తాగునీళ్లకు 5 టీఎంసీలు, సాగుకు 25 టీఎంసీలు, సాగర్ ఎడమ కాలువ కింద సాగుకు 75 టీఎంసీలు, తాగునీటికి 5 టీఎంసీలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కింద సాగుకు 28 టీఎంసీలు, తాగునీటికి 10 టీఎంసీలు అవసరమని వెల్లడించారు. మొత్తంగా డిసెంబర్25వ తేదీ వరకు సాగర్, శ్రీశైలం ద్వారా 148 టీఎంసీలు అవసరమని, ఆ మేరకు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేయాలని కేఆర్ఎంబీని కోరారు.