NRI | దక్షిణాఫ్రికాలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
దక్షిణాఫ్రికాలోని తెలంగాణ ప్రవాస భారతీయులు 12వ ‘తెలంగాణ అవతరణ’ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
జోహానెస్బర్గ్, జూన్ 6 : దక్షిణాఫ్రికాలోని తెలంగాణ ప్రవాస భారతీయులు 12వ ‘తెలంగాణ అవతరణ’ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. జోహానెస్బర్గ్లో జరిగిన ఈ వేడుకకు తెలంగాణ వాసులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రవాస భారతీయులు, ఇతర భారతీయ సంస్థల ప్రతినిధులు, అక్కడి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా(TASA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా పిల్లల నృత్యాలు, పాటలతో అలరించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భారతీయ కాన్సులేట్ జనరల్ కౌన్సిలర్ సుమతి రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది మంది ప్రాణాలు అర్పించారన్నారు. ఇలాంటి వేడుకల్లో ఇతర దేశాల్లో జరుపుకోవడం తెలంగాణకే గర్వకారణమన్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు, మురళి బండారు మాట్లాడుతూ..ప్రత ఏటా ఈ దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాం.
ఇది మా మట్టికి మనం ఇచ్చే గౌరవానికి నిదర్శనం అన్నారు. తెలంగాణ సమైక్యతకు, సాంస్కృతిక విలువలకు ఇదే ఉదాహరణ అని తెలిపారు. అలాగే కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగ దినోత్సవానికి అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

