Rs praveen kumar | పోక్సో కేసు పెట్టారనే కక్షతో రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాధిత కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. షాబాద్ మండలం దైవాలగూడకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని చేవెళ్ల వదవ్ద పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం నరేందర్ రెడ్డిని శంకర్పల్లి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఇక పటోళ్ల కార్తీక్ రెడ్డిని కూడా హౌస్ అరెస్టు చేశారు.
బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణ పోక్సో కేసులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. అరెస్టు చేయాల్సింది మమ్ములను కాదు రేవంత్ రెడ్డి.. ఆరుగురిని పాశవికంగా హత్య చేసిన నిందితుడిని అని హితవు పలికారు. నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడు. తమరు మాత్రం ఖమ్మంలో పిక్నిక్ లో బిజీగా ఉన్నారు.
నేరం జరిగి 55 రోజులయినా ఇంతవరకు పోలీసులు నిందితుడిని ఇంతవరకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. పోలీసులు అంతా రేవంత్ రెడ్డి వారి సోదరులను కాపాడడంలో బిజీగా ఉన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి న్యాయం కోసం షాబాద్‌కు పోదామని బయలుదేరితే చేవెళ్లలో పోలీసులు నన్ను, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి శంకర్ పల్లి పోలీసు స్టేషన్లో బంధించారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతి రాథోడ్ ను కూడా అరెస్టు చేశారు. ఎందుకింత భయం సీఎం గారు..? వెంటనే రాజీనామా చేయండి. బాధ్యులైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణ పోక్సో కేసులకు అడ్డాగా మారింది
అరెస్టు చేయాల్సింది మమ్ములను కాదు రేవంత్ రెడ్డి.. ఆరుగురిని పాశవికంగా హత్య చేసిన నిందితుడిని
వాడు ఇంకా పరారీలోనే ఉన్నాడు. తమరు మాత్రం ఖమ్మంలో పిక్నిక్ లో బిజీగా ఉన్నారు
నేరం జరిగి 55 రోజులయినా ఇంతవరకు పోలీసులు… https://t.co/xKrXpvPPMx pic.twitter.com/ZcXc8AhcMK
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2026