తిరుమల : వరుస సెలవుల కారణంగా తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. రెండవ శనివారం, ఆదివారం సెలువు దినాలు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లన్ని నిండిపోగా పాచికల్వ గంగమ్మ ఆలయం వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం ( Sarvadarsan ) అవుతుందని తెలిపారు.
అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు తీరాయి. దీంతో రుయా ఆస్పత్రి కూడలి నుంచి ఇస్కాన్ ఆలయం మీదుగా బస్టాండ్‌కు వాహనాలను మళ్లించారు. గరుడ కూడలి మీదుగా వెళ్లాల్సిన వాహనాలను అన్నారావు కూడలి బస్టాండ్‌కు మళ్లించారు. కాగా శుక్రవారం స్వామివారని 73,265 మంది భక్తులు దర్శించుకోగా 39,690 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు చెల్లించుకున్న మొక్కుల ద్వారా హుండీకి రూ. 4.26 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు. 4.09 లక్షల లడ్డూలను విక్రయించామని, 2.98 లక్షల మందికి అన్నప్రసాదం అందజేశామని వెల్లడించారు.